జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు.
ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు.
దిల్ రాజు,భోనీ కపూర్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా నివేదా థామస్ ముఖ్యపాత్రలో నటిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.