మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ ప్రభుత్వంలోనే కాకుండా ఈ 40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తి ఎన్నడూ చేసింది చేసినట్టు చెప్పలేదు. ఇలా చేసానని చెప్పుకునే ధైర్యం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే అతను చేసింది మంచిపని అయితే 10మంది చెప్పుకుంటారు. చెడ్డపని అయితే ఆయన చెప్పుకోడానికే బయపడతారు. ఇలా తన రాజకీయ జీవితంలో ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పుకునే తిరిగారంటు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. “సమయం, సందర్బం లేకుండా 40 ఏళ్ల అనుభవం గురించి, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ముచ్చట్లు, సెల్ ఫోన్లు తెచ్చానన్న కోతలు, ఉన్నవవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడు అదే విషయాన్ని జగన్ గారు ప్రస్తావిస్తే నొచ్చుకోవడమెందుకు? చంద్రబాబు? అని ప్రశ్నించారు.