టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముందు హాజరవుతున్నాడు. ఈమేరకు పోలీసు వారు వర్మకు నోటిసులు ఇవ్వడం జరిగింది. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు ఫైల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో భాగంగా తమ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి పెట్టారని కేఏ పాల్ భార్య ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. మరి వర్మ పోలీసులకు ఎలాంటి సమాధానం ఇస్తాడో తెలియాలి.
