Home / MOVIES / రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా గళం విప్పిన నటి శ్రీరెడ్డి మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‌పై విమర్శలు చేసింది. ఈ సారి పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్‌ను కూడా సీన్లోకి లాగింది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే.. శ్రీరెడ్డి ఈ మధ్య పాజిటివ్ పోస్టులు కూడా చేసింది. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గారూ హ్యాపీ బర్త్ డే.. దీపిక పదుకొనే చపాక్ ట్రైలర్ బాగుంది అంటూ పాజిటివ్ కామెంట్స్ చేసింది. అయితే కొన్ని గంటలు కూడా గడవకముందే రేణు దేశాయ్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. తాజాగా రేణు దేశాయ్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. రేణూ గారూ బెస్ట్ ఆఫ్ లక్.. మీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా.. మీరు ఓ నరకం నుంచి బయటికి వచ్చారంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన కామెంట్స్ మళ్ళీ పవన్‌ను టార్గెట్ చేసే విధంగానే ఉన్నాయి. దాంతో పవన్ అభిమానులతో శ్రీ రెడ్డి యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు రేణు దేశాయ్‌ను సైతం మధ్యలోకి తీసుకురావడం వెనక శ్రీ రెడ్డి అంతరార్థం ఏంటో ఎవరికి అంతుచిక్కడం లేదు.

Renu desai u r the best..u r leading the best life,u came out of hell..

Posted by Sri Reddy on Friday, 13 December 2019