రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీస్తూ రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనంను దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని, గత ప్రభుత్వం టెండర్ల పేరుతో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్ లకు లాభం చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవే పనులకు నేడు రివర్స్ టెండరింగ్ జరిపితే కోట్లాధి రూపాయల మేర ప్రభుత్వంపై భారం తగ్గుతోందని తెలిపారు.పోలవరం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.55వేల కోట్లు కాగా ఇప్పటి వరకు దానికి ఖర్చు చేసింది రూ.17వేల కోట్లు అంటే పోలవరం ప్రాజెక్ట్ పనులు జరిగింది కేవలం 35శాతం మాత్రమేనని, టీడీపీ నేతలు మాత్రం తాము 65శాతం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేశామని లెక్కలుచెబుతున్నారు. వారి ప్రభుత్వంలో మొదటి మూడేళ్లు ఎటువంటి పనులు మెుదలుకాలేదు.
పోలవరం కుడి ప్రధాన కారులవ టన్నెల్ కు టిడిపి ప్రభుత్వం 4.67 శాతం ఎక్సెస్ కు మ్యాక్స్ అనే కంపెనీకి టెండర్లు కట్టబెట్టింది. ఇదే టన్నెల్ కు మేం రివర్స్ టెండరింగ్ చేస్తే అదే సంస్థ 15శాతం లెస్ కు కోట్ చేసింది. అలాగే వెలుగొండ టన్నెల్ కు రిత్విక్ సంస్థ 4.69శాతం ఎక్సెస్ కు టెండర్ అప్పగించారు. మేం రివర్స్ టెండరింగ్ చేస్తే రిత్విక్ సంస్థ 6.5శాతం తక్కువకు ఎలా కోట్ చేసింది? హెచ్‌ఎన్‌ఎస్ఎస్ పనుల్లోనూ 4.95శాతం ఎక్సెస్ కు టెండర్లు కట్టబెట్టారు. అదే సంస్థ రివర్స్ టెండరింగ్ లో 25శాతం లెస్ కు టెండర్లు వేశారు. అంటే అధికంగా కోట్ చేసిన సొమ్ము ఎవరికి కమీషన్లుగా వెళ్లాయి అని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ను అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తామని మంత్రి అనిల్ తెలియజేశారు. వచ్చే సీజన్ నాటికి ముంపు ప్రాంతంలోని 18వేల ఇళ్లను ఖాళీ చేయించి, పునరావాసం కల్పిస్తామని. నవంబర్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రారంభించామని ఏవిధమైన అవినీతికీ తావివ్వకుండా ప్రాజెక్ట్ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలియజేశారు.