తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న వారికి ప్రత్యేక అభినందనలు. రాష్ట్రంలో విద్యుత్ ను ఎక్కువగా పొదుపు చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన కానీ ఎల్ఈడీ బల్బ్ లు వాడుతున్నారు. ఇది చాలా మంచి శుభపరిణామం..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతమని అన్నారు. సీఎం కేసీఆర్ చాలా చక్కగా హారితహర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క విద్యుత్ నే కాదు నీటిని కూడా పొదుపు చేయాలని”గవర్నర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.