సూపర్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు షూటింగ్ ప్రారంభం నుండి గట్టిపోటీ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి రేస్ లో కూడా పోటీకి రెడీగా ఉన్నారు. రెండు చిత్రాలు ఒకేరోజున విడుదల కానున్నాయి. సినిమా విషయం పక్కన పెడితే ప్రస్తుతం ప్రీరిలీజ్ ఈవెంట్స్ కూడా ఒకేరోజున జనవరి 5న పెట్టడం జరిగింది. అయితే సరిలేరు నీకెవ్వరుకు మెగాస్టార్ ముఖ్య అతిధిగా వస్తుండగా అటు త్రివిక్రమ్ సినిమాకు ఆర్ఆర్ఆర్ టీమ్ వస్తుందట. ఇందులో రాంచరణ్ మరియు ఎన్టీఆర్ వస్తున్నారని తెలుస్తుంది. మరి ఎవరి ఈవెంట్ సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే.
