వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మరియు లోకేష్ పై విరిచుకుపడ్డారు. ఇక లోకేష్ కి అయితే చురకలు అంటించాడు. పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే… నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో ఫ్రస్టేట్ అవుతున్నాడు అని అన్నారు. మీరు ఎన్ని కబుర్లు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. నీకున్న తెలివికి చంద్రబాబు గారికి ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని అన్నారు.
