జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా మా నాయకుడు జగన్ ఉన్నారని అన్నారు. సినిమాలు పరంగా మిమల్ని ఆదరిస్తరేమో గాని ఇక్కడ అలా ఉండదని అన్నారు.
