గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గెలిచిన మాట వాస్తవమే. అనంతరం చంద్రబాబు గెలిచారు కాబట్టి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తారు. మనకి అంతా మంచే జరుగుతుంది అనుకున్నారు అంతా. కాని అక్కడ కధ మొత్తం అడ్డం తిరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టీడీపీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులే బాగుపడ్డారు. ఆ ఐదేళ్ళు ప్రజలను ఎర్రోల్లని చేసి ఆడుకున్నారు. మాట ఇచ్చి తప్పారు చంద్రబాబు. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ నేను ఉన్నాను మాట ఇస్తున్నాను అధికారంలోకి వచ్చాక మీ జీవితాలు మారుస్తాను అని మాట ఇచ్చారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “సీఎం జగన్ గారెప్పుడూ మాట తప్పరు. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావం. తమరెప్పుడూ మాట మీదుండరు చంద్రబాబూ. అది మీ నక్కజిత్తుల కపట గుణం. యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం మీ కర్మ. మీరు మారాలని ఎవరూ కోరుకోవడం లేదు. అలాగే ఉండండి” అని అన్నారు.
