సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్ బాబు అభిమానులు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. విడుదలకు ముందు జనవరి 5న ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.