హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా సోమవారం నాడు అల వైకుంటపురములో మ్యూజికల్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు గాను మ్యూజిక్ నే హైలైట్ అని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే బన్నీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేమిటంటే ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే ఒక్కసారిగే నాకు మెగాస్టార్ అంటే పిచ్చ ఇష్టమని ఆ తరువాత రజినీకాంత్ అంటే ఇష్టమని అంతకుమించి ఇంకెవరు లేరని చెప్పడమనే కాకుండా పవర్ స్టార్ అని అరుస్తుంటే వెంటనే అది వినిపించకుండా సౌండ్స్ పెట్టమని అన్నారు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
