Home / ANDHRAPRADESH / చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!

చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. బాబు తమ ప్రభుత్వంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని కోసం ఇటుకలు అంటూ స్కూల్ పిల్లల నుండి సైతం 10 రూపాయలు వసూలు చేసిన బాబు  తన కుటుంబ సభ్యుల నుండి విరాళాలు ఎందుకు సేకరించలేదో చెప్పాలని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ లో తమ వాళ్ళు కొనుగోలు చేసిన భూముల కోసం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని, అలాంటి చంద్రబాబు కు రైతులు ఎందుకు మద్దతు ఇస్తారు అంటూ విమర్శించారు. బాబు అవినీతితో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని గుర్తుచేశారు.  రాజధాని ఏర్పాటుపై జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, దీని ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందన్నారు. చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకువచ్చి వేషాలు వేయించే ప్రయత్నం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం లో ఉన్నారని అన్నారు. బాబు మాటలు నమ్మి బయటకు వస్తే భువనేశ్వరి కి ఉన్న పరువు కూడా పోతుందని, ఎన్టీఆర్ కూతురుగా ప్రజలలో ఆమె పొందుతున్న గౌరవం సైతం పోతుందని  ఆమెకు సూచించారు.