Home / MOVIES / కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు

కారులో ఇస్మార్ట్ బ్యూటీ షీకారు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యంగ్ ఎనర్జీ హీరో రామ్ కథానాయకుడిగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీలో అందాలను ఆరబోసి కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్.

ఈ మూవీకి ముందు ముద్దుగుమ్మ అనేక చిత్రాల్లో నటించిన కానీ రాని పేరు ఈ చిత్రంతో అమ్మడు ఎక్కడకో ఎదిగిపోయింది. తాజాగా ఈ అందాల రాక్షసి సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు,ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా ఆశోక్ హీరోగా నటిస్తున్న చిత్రంలో అందాలను ఆరబోయడానికి సిద్ధమైంది.

దేవదాస్ ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలోని ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పద్మావతి గల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ కారులో షీకారు చేస్తున్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ కారులో షీకారు చేయడం విశేషం కాదు కానీ రూ.90లక్షలు పెట్టి కొన్న కారులో షీకారు చేయడమే విశేషం.. ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసింది.