అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు.
దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు ప్రసాద్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు..