సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల సునామీతో రెండు వందల కోట్లకు చేరుకుంది.
అయితే మహేష్ తాజా చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ను స్పై కథాంశంతో జేమ్స్ బాండ్ లా చూపించేందుకు దర్శకుడు వంశీ రెడీఅవుతున్నాడని సమాచారం. ఇప్పటికే కథ కూడా ఒకే అయింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనున్నది.ఈ చిత్రం యొక్క ఫ్రీ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.