జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ఎడిటర్స్ ఈవెంట్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన అందరు రావడం ఇందులో మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఉండడం అందరికి కన్నులవిందుగా కనిపిస్తుంది. ఇక ఇందులో సమంత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. ఇక అసలు విషయానికి వస్తే యాంకర్ ప్రదీప్ సమంత పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడని తెలుస్తుంది. ఇంక ఆ సంభాషణ విషయానికి వస్తే.. 2010లో ఏం మాయ చేసారో తెలియదు గాని మా అందరి హృదయాలు కొల్లగొట్టారు, అక్కడిదాకా ఆగకుండా ఆరడుగులు ఉంటాడా అని అడిగారు అప్పటినుండి మేమందరం హీల్స్ వేసుకుంటున్నాం, ఇక 2017 లో మీరు చేసిన పనికి మాలాంటి వారి ఎన్నో జీవితాలు గుండెలు బద్దలయ్యాయి అని డైలాగ్స్ వేసి షో మొత్తానికి కల తెప్పించాడు.
