తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 111 మున్సిపాలిటీల్లో గెలుపొందింది. ఈ క్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలలో తీవ్రమైన ఉద్రిక్తత చోటుచేసుకుంది.
3వ వార్డులో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరికీ 356 చోప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. ఒక ఓటు రెండు గుర్తుల మధ్యలో వేసిన ఓటు వచ్చింది.
అయితే ఎన్నికల నియమావళి ప్రకారం స్కేలుతో కొలిచి.. ఓటు ఎక్కువ శాతం కారు గుర్తుకు రావడంతో టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లుగా ప్రకటించారు.