ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దుచేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన సీఏం జగన్ బాబుకి సరైన సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. మండలి కచ్చితంగా అవసరమే అనుకుంటే ప్రతిరాష్ట్రంలో మండలి ఏర్పాటు అయి ఉండేది. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా వద్దా అన్న ప్రశ్న మనముందు ఉంది అని ఆయన అన్నారు.
