మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో ప్రతీఒక్కరికి గుర్తుండిపోయే పేరని చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలో అందరికి నచ్చేవి డైలాగ్స్ అందుకే ఆయనని మాటల మాంత్రికుడు అంటారు. ప్రతీ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి సంక్రాంతి హిట్ చేయడమే ఆయన పని. దీనికి ముఖ్య ఉదాహరణ అత్తారింటికి దారేది సినిమా అనే చెప్పాలి. ఆ తరువాత ఇప్పుడు మల్లా అల్లు అర్జున్ తో సంక్రాంతి హిట్ తెచ్చిపెట్టాడు. ఇక అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే అని తెలిసిందే. దాంతో సంక్రాంతికి మరో హిట్ ఇవ్వబోతున్నాడని అందరు అనుకున్నారు. కాని ఈసారి సంక్రాంతి భరిలో ఆయన లేనట్టేనని తెలుస్తుంది. దీనంతటికి కారణం ఎన్టీఆర్ ఎందుకంటే ఆయన ప్రస్తతం ఆర్ఆర్ఆర్ లో చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఇంకా ముగింపుకు రాలేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలీదని చెప్పాలి. ఎన్టీఅర్ ఫ్రీ అయితేనే వీరిద్దరిది స్టార్ట్ అవుతుంది. దాంతో సంక్రాంతికి కాకుండా ఈసారి సమ్మర్ కి వస్తుందని భావిస్తున్నారు.
