టాలీవుడ్ మన్మధుడు,సీనియర్ హీరో అక్కినేని నాగార్జున బృందానికి కరోనా వైరస్ ఎఫెక్టైంది. ప్రస్తుతం నాగ్ మెయిన్ రోల్ లో మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మాణంలో అహిషోర్ సోలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్.
ఇప్పటికే దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రంలో నాగ్ ఎన్ఐఏ అధికారి అయిన విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే థాయ్ లాండ్ లో జరిగేలా ప్లాన్ చేశారు. అయితే థాయ్ లాండ్ లో పాతిక వరకు కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో చిత్రం యూనిట్ అక్కడకి వెళ్ళడానికి సంకోచిస్తున్నారు. దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారు చిత్రం యూనిట్ .