దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే.
ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా దిల్ రాజుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఏమిటంటే దిల్ రాజు త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నాడు. బ్రాహ్మణి వర్గానికి చెందిన సినీ నేపథ్యం లేని యువతితో దిల్ రాజుకు పెళ్ళి కానున్నది అని ఈ వార్తల సారాంశం.
అయితే సెలబ్రేటీ గురించి సోషల్ మీడియాలో పుఖార్లు రావడం సాధారణం. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో దిల్ రాజు చెప్పాల్సి ఉంది.చూడాలి మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కాలమే సమాధానం చెప్పాలి.