అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ విషయంలో ఒక సంచలన విషయం బయటపెట్టింది. దాంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతకు అంత షాక్ ఇచ్చే మేటర్ ఏమిటీ అనే విషయానికి వస్తే..తాను ఇంకో రెండు మూడేల్లే మీకు అందుబాటులో ఉంటానేమో..నాకు ఫ్యామిలీ ఉంది వారితో గడపాలి హీరోయిన్ అంటే పూర్తిగా సినిమాలకే అంకితం కాదు అని అన్నారు. దీనికి హర్ట్ అయిన అభిమానులు ఏవేవో ఊహించుకున్నారు. మరోపక్క సినీ వర్గాల్లో సమంతను వారి కుటుంబీకులు పిల్లల విషయంలో ఫోర్సు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో ఆలోచించాలి.