Home / SLIDER / సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్

సీఏఏకు అందుకే వ్యతిరేకం – మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకం అని ప్రకటించిన సంగతి విదితమే. అయితే సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ లో వెల్లడించారు.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని ప్రాంతాలు ,మతాలు,కులాల కలయిక అని అన్నారు. అలాంటప్పుడు ఈ బిల్లుతో ఏమి అవసరం వచ్చింది అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

సీఏఏ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేదిగా ఉంది. సీఏఏలో ముస్లీంలను చేర్చకపోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పారు. ఈ బిల్లు కంటే దేశంలో అనేక సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.