రష్మిక మందన్న..ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ తో చేతినిండా పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మహేష్ తో నటించింది. అల్లు అర్జున్ తో నటించబోతుంది. ఇక నితిన్ సరసన భీష్మ సినిమాలో చేస్తుంది. ఇంత బిజగా ఉన్న ముద్దుగుమ్మకు తాజాగా ఒక చేదు అనుభవం చోటుచేసుకుంది. ఈరోజుల్లో అభిమానులు హీరోయిన్ లను తెరపై చూస్తూనే ఆగడం లేదు ఇక నేరుగా చూస్తే సైలెంట్ గా ఉంటారు. అస్సలు ఉండరు..అయితే ఇప్పుడు అదే రష్మిక కొంప ముంచింది. ప్రస్తుతం భీష్మ సినిమాకు సంబంధించి ప్రమోషన్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఒక ప్రోగ్రాంకు వెళ్లి వస్తుండగా ఒక అభిమాని సేల్ఫీ అంటూ ముందుకు వచ్చి ముద్దు పెట్టేసాడు. ఆ షాక్ నుండి అందరు తేరుకునే లోపే అతడు పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. దాంతో రష్మిక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ వీడియో డిలీట్ చేసారు.
