ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పరిపాలన లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అధికారం దిగిపోయే వరకు చంద్రబాబు అండ్ కో చెయ్యని అవినీతి లేదు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం అదేవిధంగా కేంద్రంతో విభేదాలు పెంచుకుంటూ ఉండడం అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఏదో విధంగా విషయంలో జగన్ పై వ్యతిరేకత ప్రయత్నాలు చేయడంతో చంద్రబాబు తనకు మైలేజీ పెరుగుతుందని భావించారు. అలా జరగకపోగా పాత కేసులన్నీ ఇప్పుడు చంద్రబాబుని వెంటాడే అవకాశం కనిపిస్తోంది. రాజధాని, పోలవరం పేరుతో దోచుకున్నవన్నీ ఇప్పుడు బట్టబయలు అవుతోంది.
కాంట్రాక్టు సంస్థలకు పనులు చేస్తున్న సందర్భంలో వేలకొద్ది డబ్బులు తీసుకున్నట్టు చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఆధారాలు దొరకడం తో చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఊహాగానాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ తన అరెస్టు అంటూ జరిగితే జనం మధ్య జరగాలని అప్పుడు వరకు ప్రజల్లో ఉంటే చంద్రబాబు ప్రజా బలం కలిగిన నాయకుడిగా బిల్డప్ ఇచ్చుకోవచ్చనే ఉద్దేశంతో ఈ యాత్రలు చేపడుతున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై స్పందించి విజయసాయి రెడ్డి “అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడు. కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటా. ఎమ్మెల్యేలను చుట్టూ పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. చేసిన తప్పులు సామాన్యమైనవా తప్పించుకోవడానికి” అని అన్నారు.