Home / MOVIES / ఎన్టీఆర్ కు జోడిగా సమంత

ఎన్టీఆర్ కు జోడిగా సమంత

టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ పేరు వినిపిస్తుంది.

రష్మిక మంధానను పక్కనెట్టి సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని ఆ చిత్రం యూనిట్ భావిస్తుందని సమాచారం. అయితే గతంలో సమంత ఎన్టీఆర్ తో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్ గా నటించి.. అందాలను ఆరబోసింది.