Home / 18+ / బ్రేకింగ్ న్యూస్.. మార్చ్ లో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న తారక్ !

బ్రేకింగ్ న్యూస్.. మార్చ్ లో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న తారక్ !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంటపురంలో చిత్రంతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ్లాస్టర్ అందించాడు. ఇక త్రివిక్రమ్ తరువాత సినిమా ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ పురాణాలు, ఇతిహాసాలలోని మంచి పదాలను తీసుకొని టైటిల్స్ పెడుతున్నాడు. అయితే రాబోయే సినిమా పూర్తిగా రాజకీయపరంగా ఉంటుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశం ఎదురుకుంటున్న రాజకీయ పరిస్థుతుల నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అదేగాని నిజమైతే మార్చ్ నెలలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అంటే షూటింగ్ లో భాగంగా అడుగుపెట్టనున్నాడు.