టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలలో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగలకి, బర్త్‌డేలకి కూడా చిత్ర పోస్టర్‌లు కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని ట్యాగ్ చేస్తూ ‘అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావు’ అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన చిత్రబృందం ‘‘మార్చి నుంచి’’ అని సమాధానం ఇచ్చింది. మార్చి 27వ తేదీన రామ్‌చరణ్ పుట్టినరోజు.. ఆ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీ ఫస్ట్ లుక్ విడుదలవుతుందని అభిమానులు భావిస్తున్నారు.