Home / SLIDER / పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.