తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రయివేట్ ఆసుపత్రులల్లోనూ వైద్యానికి అనుమతులు ఇస్తూ ఆదేశాలను జారీచేసింది.
అయితే చాలా మంది జలుబు,దగ్గు,జ్వరం సోకిన బాధితులు వైరస్ ఉందేమో అనే భయంతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.
బుధవారం ఒక్కరోజే ముప్పై ఆరు మందికి అనుమానంతో పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇటు కరోనాపై భయాలు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు.