తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము.
ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ ఇది గుండె పగిలే వార్త అని పేర్కొంది.తన దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్ కరోనా వైరస్ ప్రభావంతో తాను ఎదుర్కుంటున్న విపత్కర పరిస్థితులను వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈరోజు అయిన తన భర్త ఇంట్లో వస్తువులను తీసుకువస్తాడని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తు ఉంటుందని. గత రెండు రోజులుగా ఇంట్లో వస్తువులను తీసుకెళ్లలేదు మేడమ్ అని ఏడుస్తూ తన బాధను చెప్పాడని.. నలబై ఎనిమిది గంటల్లో తానే తొలి కస్టమర్ అని చెప్పాడని వివరించింది.
డ్రైవర్ బాధను ఆర్ధం చేసుకున్న నేను రూ.500లు ఎక్కువే ఇచ్చానని తెలిపింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ ప్రభావం వలన రోజు వారి ఆదాయంపై ఆధారపడి బ్రతికే వారి కష్టాలు ఎలా ఉంటాయో చెప్పడానికిదే నిదర్శనం.. రోజు వారి ఆదాయంపై ఆధారపడేవాళ్లకు కాస్త సాయం చేయమని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.