ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రజలను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలకు తోడుగా సెలబ్రిటీలు కూడా నిలిచారు. ఇందులో భాగంగా నితిన్,పవన్ కళ్యాణ్, రాంచరణ్ ఇప్పటికే తనవంతు సహాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ఇవ్వగా తాజాగా ప్రభాస్, మహేష్ బాబు కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు చొప్పున విరాళం ఇచ్చారు. అంతేకాకుండా మహేష్ మన ఆరోగ్యం కాపాడుకోడానికి ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలను కోరాడు. ఇంకా చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చి ప్రభుత్వానికి తోడుగా ఉండాలని అన్నారు.
