కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఎందరో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ లక్ష కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందించనున్నట్లు తెలిపారు. అమితాబ్ చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్, కల్యాణ్ జ్యువెలరీ సంస్థలు మద్దతు ఇవ్వనున్నాయి.