కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 వేల మంది మృతి చెందారు.
ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ వైరస్ నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,739 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్పెయిన్‌లో 16,081 మంది, ఇటలీలో 18,849, జర్మనీలో 2,707, ఫ్రాన్స్‌లో 13,197 మంది, యూకేలో 8,958 మంది, ఇరాన్‌లో 4,232, టర్కీలో 1006, బెల్జియంలో 3,019, స్విట్జర్లాండ్‌లో 1,002, నెదర్లాండ్స్‌లో 2,511, కెనడాలో 569, బ్రెజిల్‌లో 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు.