Home / SLIDER / తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు.

దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ రోజు 78 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,766కు చేరుకుంది.

ప్రస్తుతం 7,436 మంది కరోనాతో పోరాడుతున్నారు. 24 గంటల్లో 4,374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు.