ప్రముఖ కవి, నాటక రచయిత , రేడియో వ్యాఖ్యాత జ్యోతిష్య విద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయ శర్మ గారి మృతి సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని లోటు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈరోజు ఉదయం ఆయన అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతి పట్ల మంత్రి హరీష్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రచయితగా, కవిగా, ఆకాశవాణి కళాకారుడిగా , జ్యోతిష్య పండితులుగా పేరుగాంచారు అని..
ఆయన వ్రాసిన ” భువన విజయం ” పద్యనాటకం జాతియ స్థాయిలో దూరదర్శన్ ద్వారా ప్రసారం అయి ఎన్నో ప్రశంసలు పొందింది అని ఆయన సేవలను కొనియాడారు…
ఆయన మృతి కి సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..