Home / SLIDER / తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ పంజా విసురుతోంది… కాస్త త‌గ్గిన‌ట్టుగానే అనిపించిన క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా హెల్త్ బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 1,897 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి..

ఇదే స‌మ‌యంలో 9 మంది మృతి చెందారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన‌వారి సంఖ్య 654కు పెరిగింది.

ఇక‌, 24 గంట‌ల్లో 1,920 మంది క‌రోనా నుంచి కోలుకోగా… ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన‌వారి సంఖ్య 61,294కు పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 22,596 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. ఆది నుంచి క‌రోనావైర‌స్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న హైద‌రాబాద్‌లో కేసులు మళ్ళీ భారీగానే నమోదయ్యాయి.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 479 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 162, క‌రీంన‌గ‌ర్‌లో 64, మేడ్చ‌ల్‌లో 172, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 87, జోగులాంబ గ‌ద్వాల్‌లో 38, జ‌న‌గాంలో 26 కేసులు గ‌త 24 గంట‌ల్లో అత్య‌ధికంగా న‌మోదు అయ్యాయి. ఇక‌, పూర్తి వివ‌రాల‌తో కూడిన 61 పేజీలతో క‌రోనా హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య‌శాఖ‌.