ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అయినా కరోనా బారిన పడటంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయన్ను తిరుపతికి తరలించినట్లు సమాచారం.