నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
ఎడ్మ కొడుకు సత్యం ప్రసుత్తం కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌గా(టీఆర్‌ఎస్) కొనసాగుతున్నారు. 2018లో కిష్టారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయన.