Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. కాగా గత 24 గంటలుగా 09 కరోనా మరణాలు సంభవించాయి.

తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 827మంది మృతి చెందారు.కాగా.. ఇవాళ 1,849మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 92,837మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 31,299 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 360, కరీంనగర్‌ 180, రంగారెడ్డి 129, ఖమ్మంలో 103 కేసులు నమోదయ్యాయి.

అయితే.. గత 24 గంటలుగా 1873 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1849 మంది డిశ్చార్జ్ కావడంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కాసింత తగ్గిందనే చెప్పుకోవచ్చు.