Home / MOVIES / అనుష్క సరికొత్త రికార్డు

అనుష్క సరికొత్త రికార్డు

సౌత్‌ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే హీరోయిన్‌లలో బొమ్మాళీ అనుష్క ఒకరు. సినిమాలలో ఎలా కనిపించినా.. పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె సినిమాలు స్పీడ్‌ స్పీడ్‌గా చేయకపోయినా.. ఏదో ఒక రూపంలో అనుష్క ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా ఆమె యాక్టివ్‌గా ఉండేది చాలా తక్కువే.

అయినప్పటికీ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ పరంగా ఇప్పటి వరకు కాజల్‌, తమన్నాలకే సాధ్యమైన గుర్తింపు, రికార్డ్ ఇప్పుడు అనుష్కకు కూడా దక్కింది. 23 మిలియన్‌ ఫాలోవర్స్‌ని సాధించి కాజల్‌, తమన్నాల సరసన చేరింది స్వీటీ అనుష్క.

అనుష్కను ఫేస్‌బుక్‌లో 23 మిలియన్‌ ప్లస్‌ ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో టాప్‌ సెలబ్రిటీలైన రజినీకాంత్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి వారిని బీట్‌ చేసి హీరోయిన్లు టాప్‌ ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌, లైక్స్‌ ఉన్న రికార్డ్ కాజల్‌ పేరిట ఉంది.

కాజల్‌కు 2 కోట్ల 35 లక్షల ఫాలోవర్స్‌-2కోట్ల 34 లక్షల లైక్స్‌ ఉండగా..అనుష్క 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌-కోటి 44 లక్షల లైక్స్‌, తమన్నా 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌- కోటి 22 లక్షల లైక్స్‌, ప్రభాస్‌ 19 మిలియన్‌ ప్లస్‌ ఫాలోవర్స్-10 మిలియన్‌ ప్లస్ లైక్స్‌‌, హీరోయిన్‌ సమంత 17 మిలియన్‌ ప్లస్‌ ఫాలోవర్స్‌-9 మిలియన్‌ ప్లస్‌ లైక్స్‌, అల్లు అర్జున్‌ 16 మిలియన్‌ ప్లస్‌ ఫాలోవర్స్‌-13 మిలియన్‌ ప్లస్ లైక్స్‌తో తర్వాతి స్థానాలలో ఉన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat