Home / MOVIES / మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్

మెగాస్టార్ కు చెల్లెగా స్టార్ హీరోయిన్

ఆచార్య’ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

‘ఆచార్య’ సినిమా తర్వాత ‘లూసిఫర్‌’ రీమేక్‌తో పాటు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్‌లో మెగాస్టార్‌ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వేదాళం రీమేక్‌ విషయానికొస్తే.. బ్రదర్‌, సిస్టర్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా నడిచే సినిమా ఇది.

కాగా.. ఇందులో చెల్లెలు పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది ఆసక్తికరమైన డిస్కషన్‌గా మారింది. లేటెస్ట్‌ సినీ వర్గాల సమాచారం మేరకు ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయిపల్లవిని నటింప చేయడానికి మేకర్స్‌ సంప్రదింపులు జరుగుతున్నాయట.

మరి క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పాత్రలో నటించడానికి ఓకే అంటారా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే ముందు ‘ఆచార్య’ సినిమా పూర్తి కావాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat