Home / SLIDER / తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు.

దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరగా.. 1,033మంది మరణించారు.

తెలంగాణలో ప్రస్తుతం 30,573 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,39,700మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి 182, మేడ్చల్‌ 146, భద్రాద్రి కొత్తగూడెం 51, మంచిర్యాల్‌ 38, మెదక్‌ 28, ములుగు 15, నాగర్‌ కర్నూల్‌ 37, నల్గొండలో 124 కరోనా కేసులు నమోదయ్యాయి.