Home / MOVIES / డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌కు హాజ‌రైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే.

బాలీవుడ్ హీరోయిన్లు శ్ర‌ద్ధాక‌పూర్‌, సారాఅలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దీపికాకు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేప‌టి క్రితం చేరుకున్న‌ది. ముంబైలోని కొల‌బా ప్రాంతంలో ఉన్న అపోలో బండ‌ర్ లోని ఎవ్లిన్ గెస్ట్‌హౌజ్‌లో దీపిక‌ను విచారిస్తున్నారు. నిన్న ర‌కుల్‌ను నాలుగు గంట‌ల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు.

ఇవాళ సారా అలీఖాన్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌ను ఎన్సీబీ పోలీసులు బ‌ల్లార్డ్ ఎస్టేట్‌లో విచారించ‌నున్నారు. దీపిక మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌ను శుక్ర‌వారం ప్ర‌శ్నించారు. ఆమెను ఇవాళ కూడా మ‌ళ్లీ విచారించే అవ‌కాశాలు ఉన్నాయి.

రియా చ‌క్ర‌వ‌ర్తితో జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణ ఆధారంగా ర‌కుల్‌, క‌ర్మిషాల‌ను ఎన్సీబీ విచారించింది. బాలీవుడ్ స్టార్స్ మారిజునా తెప్పించుకున్న‌ట్లు వాట్సాప్ సంభాష‌ణ ద్వారా వెల్ల‌డైంది.