Home / NATIONAL / మాజీ సీఎంకు కరోనా

మాజీ సీఎంకు కరోనా

క‌రోనా బారిన‌ప‌డుతున్న ప్ర‌మ‌ఖుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. నిన్న అసోం మాజీ ముఖ్య‌మంత్రి త‌రుణ్ గొగోయ్ ఐసీయూలో చేర‌గా, తాజాగా జార్ఖండ్ ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి బాబూలాల్ మ‌రాండీ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు.

ఆయ‌న శుక్ర‌వారం క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్‌గా తేలిద‌ని రాత్రి పోద్దుపోయిన త‌ర్వాత ట్వీట్ చేశారు.

త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో పరీక్ష చేయించుకున్నాన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాన‌ని తెలిపారు.

గ‌త‌కొన్ని రోజులుగా త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. మీ అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వ‌చ‌నాలతో తొంద‌ర్లోనే కోలుకుంటాన‌ని, మ‌ళ్లీ ప్ర‌జాసేవ చేస్తాన‌ని చెప్పారు.