ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు శనివారం ఉదయం విడుదల చేశారు. రాష్ట్రంలోని కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,953 మంది హాజరు అయ్యారు.. 1,33,066 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 75,858 మంది హాజరు అవగా.. 69,616 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
మెడికల్‌లో 47,196 మంది అమ్మాయిలు, 22,420 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు..ఇంజినీరింగ్‌లో 79,030 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. మెడికల్‌లో తెనాలికి చెందిన చైతన్య సింధు ఫస్ట్ ర్యాంక్ సాధించగా, ఇంజినీరింగ్‌లో విశాఖకు చెందిన వావిలపల్లి సాయినాథ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు.