Home / ANDHRAPRADESH / అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..

అడ్డంకులున్నా.. ఆగని పోలవరం..

తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం లేదు. పని ఆగిపోయేందుకు ఎన్ని కుట్రలు సాగుతున్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడెతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు చకచకా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టుదల అసాధ్యమల్లా అనతికాలంలోనే సుసాధ్యం అవుతోంది.

* పోలవరం ఘనత ఇదీ..
పోలవరం ప్రపంచంలోనే ఒక బృహత్తర ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ లోని ప్రధానమైన స్పిల్ వే డ్యాం, కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోలవరం పనులు మాత్రం ఆగడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వే, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందివ్వనున్నారు. తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం తోపాటు జల విద్యుత్ ను ఉత్పత్తి చేయనున్నారు.

*పోలవరంకు ఘన చరిత్ర..
ఏపీ ప్రజల చిరకాల వాంఛ ఈ ప్రాజెక్ట్. 1941లో దీన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదించారు. 2005లో రాజశేఖర రెడ్డి (నాటి సీఎం) చేతుల మీదుగా పని ప్రారంభం. దాదాపు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అనుమతులన్నీ ఆయన హయాంలోనే వచ్చాయి. ధవళేశ్వరానికి 40 కిలోమీటర్ల ఎగువన రామయ్యపేట వద్ద నిర్మాణం మొదలుపెట్టారు. 2014లో రాష్ర్ట విజభన సమయంలో జాతీయ ప్రాజెక్ట్గ్ గా ప్రకటించారు. మొత్తం నిధులను కేంద్రమే భరించాలని సూచించారు. 194.6 టిఎంసీల నిల్వ, 320 టిఎంసీల వినియోగమే లక్ష్యంగా.. 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 23.5 లక్షల ఎకరాల స్థీరీకరణ, 80 టిఎంసీల వరదనీరు క్రిష్ణాకు మళ్లింపు, విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టిఎంసీలు, ఒడిషాకు 5, ఛత్తీస్ ఘడ్ కు 1.5 టిఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయించారు. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు.

*వైఎస్ఆర్ మొదలెట్టాడు.. జగన్ పూర్తి చేస్తున్నాడు..
రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం కుడి కాలువకి సంబంధించిన ప్రధానమైన పనులన్నీ పూర్తి అయ్యాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలలేదు. తదనానంతరం రాష్ట్ర విభజన జరగడం, కేంధ్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ 2014 లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తన స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకొని కేంద్రం నుంచి నిధులు వాడుకున్నాడని గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ స్వయంగా ఆరోపించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును నేనే కడతానని కేంద్ర ప్రాజెక్టుని రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చి రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొట్టారన్న ఆరోపణలున్నాయి. ఆయన హయాంలో పోలవరం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ జాప్యం వలన ప్రాజెక్టు వ్యయం మరింతంగా పెరిగి రాష్ర్టానికి గుదిబండగా మారింది. 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం పనులు ముందుకు సాగాలంటే రివర్స్ టెండరింగ్ విధానంతో పాటు ద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయాన్ని మిగుల్చుతూ పోలవరం నిర్మాణ పనుల మహత్తర కార్యాన్ని మేఘా కంపెనీకి అప్పగించారు. 2019 నవంబర్ లో పనులు మేఘా పనులను పకడ్బందీగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగించి పనులు మొదలు పెట్టి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

*పోలవరం.. ఓ భగీరథ యత్నం
పోలవరంలో అన్నీ అరుదైన, భారీవే. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో 1.18 కిలోమీటర్ల పొడవైన నిర్మాణం చేపట్టారు. 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు, నదీ గర్భంలో మూడు (ఈసిఆర్ఎఫ్ గ్యాప్..1,2,3) రాతి, మట్ట కట్ట నిర్మాణాలు, ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఇవి అరుదైన, అతిపెద్ద నిర్మాణాలు. స్పిల్ వే వైపు అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్ద వంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు. ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న, ప్రకృతి వైపరిత్యాల వలన తీవ్రమైన వరదలు సంభవించిన మొక్కవోని దీక్షతో పనులు కొనసాగించి పోలవరం ప్రాజెక్టు కి ఒక రూపు తీసుకు వచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అతి కొద్ది సమయంలోనే పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను చాలా వరకు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిరూపించారు. అధునాతన భారీ రేడియల్ గేట్లు ప్రపంచంలోనే భారీ వరద నీరు ప్రవహించే విధంగా నిర్మిస్తున్న స్పిల్ వే లో భారీ గేట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 48 గేట్లు హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేయనుంది. ఇవన్నీ రేడియల్ తరహా గేట్లు కావడం విశేషం. మొత్తం 192 గడ్డర్స్ పూర్తి చేసి, 84 గడ్డర్లను స్పిల్ వే పై అమర్చడంతో పాటు మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షట్టరింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. పియర్ పిల్లర్ల పై 250 మీటర్ల పొడవైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణము పూర్తి చేశారు. వీటితో పాటే ప్రాజెక్ట్ లో కీలకమైన ట్రన్నియన్ బీమ్స్ ని అత్యాధునిక యంత్ర సామగ్రి తో అమర్చు తున్నారు.

ప్రాజెక్ట్ స్పిల్ వే కి సంబంధించి 1,94,944 క్యూబిక్ మీటర్లు మరియు స్పిల్ ఛానల్ కి సంబంధించి 10, 64, 417 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఆశలు నెరవేర్చే విధంగా త్వరలోనే పోలవరం ఫలాలు అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఒక యజ్జంలా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన సమయంలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ముందుకు వెళుతోంది.

*కళ నెరవేరే రోజు వచ్చింది..
అలుపెరగకుండా సాగుతున్న ఈ జలయజ్ఞంలో మేఘా శరవేగంగా నిర్మాణం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం పట్టుదలతో సాగుతోంది. ఏపీ కలల ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఏపీ ప్రజల ఆశలు తీర్చాలని పనులు సాగుతున్నాయి. ప్రతిపక్షాలు అడ్డుకున్నా.. నిధుల్లో కొర్రీలు వచ్చినా కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేస్తోంది. త్వరలోనే ఇది పూర్తై ప్రజలకు సాగు, తాగు నీరు అందించే రోజులు వస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat