Home / ANDHRAPRADESH / ఏపీలో కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

ఏపీలో కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

 తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా (71) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత నెల 24న కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

వైటీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విష యం తెలియగానే కుటుంబ సభ్యు లు, బంధువులు హైదరాబాద్‌ వెళ్లి అక్కడి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఇద్దరు కుమార్తెలు అవంతి, రాజేశ్వరి, కుమారుడు అవినాష్‌ ఉన్నారు