ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 మంది కరోనా బారినపడ్డారు. 49,348 మందికి పరీక్షలు నిర్వహించగా 625 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కృష్ణాలో 103, పశ్చిమగోదావరి 93, విశాఖపట్నం 88, గుంటూరు 68, చిత్తూరు 61 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 8,67,063 కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 8,48,511 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఐదుగురు మరణించారు. కృష్ణా, పశ్చిమగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నం ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 6,981కి చేరింది. ఇక, శ్రీకాకుళం జిల్లాలో శనివారం 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 45,731కు చేరింది.